« ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము
Innellu ilalo unnamu manamu challani
share with whatsapp

పల్లవి:
ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో   
గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం    
సంతోషించు ఈ దినం    
...ఇన్నేళ్లు...
1.
లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం     (2X)
పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుని నిత్య జీవం   
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదిలపరచెనే రక్షణ భాగ్యం    
...ఇన్నేళ్లు...
2.
మారు మనస్సు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనసుకు మోక్షం    (2X)
నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా   
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించునే కలకాలం   
...ఇన్నేళ్లు...